Part-2క్రీడలలో ఎలా జాయిన్ అవ్వాలి Part -1
ఆటలంటే ఇష్టపడని పిల్లలు ఉంటారా ? కాని మన దురదృష్టం ఏమిటంటే నేడు మన పిల్లలు ఆడుకోవడానికి క్రీడా మైదానాలు ఉన్న స్కూల్స్ లేవు . మనం మన చిన్నపుడు ఆడుకున్న విషయాలు చెబితే పిల్లలు ఆర్చర్యపోయే పరిస్తితి నేడు నెలకొంది .
క్రీడల వలన శారీరక మానసిక ఉల్లాసం కలుగుతుంది , రోజంతా ఉత్సాహంగా ఉంటారు,వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది , ఆకలి మరియు అరుగుదల శక్తి పెరుగుతాయి .
దేహం యొక్క ఆకృతి అందముగా తయారవుతుంది ,తొందరగా వృద్దాప్యం రాదు . క్రీడలు కేవలం పిల్లలకు మాత్రమే కాదు అన్ని వయస్సులవారికి అవసరం .
సాదారణంగా మనం వార్తాపత్రికలలో మరియు టీవిల్లో క్రీడలకు సంభందించి అనేక కధనాలు చూస్తున్నాము అవి చూసి అవగాహన ఉన్న తల్లితండ్రులు వారి పిల్లలను క్రీడలలో జాయిను చేయాలనుకొంటె లేక వారే జాయిన్ అవ్వాలనుకొంటె అనేకరకాలయిన సందేహాలు వస్తాయి .
ఏ క్రీడలో జాయిన్ చేయాలి ? (part-2)
ఏ వయస్సులో జాయిన్ చేయాలి? (Part-3)
ఏ వయస్సు వారికి ఏ క్రీడలు బావుంటాయి ? (పార్ట్ -4)
క్రీడలకు సంబంధించిన వివరాలకు ఎవరిని సంప్రదించాలి ? (Part-5)
ఏ క్రీడలకు ఎక్కడ సౌకర్యాలు బాగున్నాయి ? (పార్ట్ -6)
వారికి ఎలాంటి ఆహారము ఇవ్వాలి ? (పార్ట్-7)
ఒకవేళ టెక్నికల్ క్రీడాపరికరాలు అవసరము అయితే అవి ఎక్కడ దొరుకుతాయి ? (పార్ట్-8)
ఫై సందేహలన్నిటికి చక్కని పరిష్కారము తెలియచేస్తున్నాము .