ఏ క్రీడలో జాయిన్ చేయాలి ? ఏ వయస్సులో జాయిన్ చేయాలి ? (పార్ట్ -2+3)
సాదారణముగా మనం మొదటసారి పిల్లలను 5 -7 సంవత్సరముల వయస్సులో స్విమ్మింగ్ ,జిమ్నాస్టిక్స్ మరియు బంతి ఆటలలో జాయిన్ చేయవచ్చు ,కాని ప్రత్యేకమైన పరివేక్షణ అవసరం .
5-7 సంవత్సరముల వయస్సును( Early -childhood )శైశవ దశ అంటారు. ఈ వయస్సులో తెలివితేటలు మరియు ప్రతివిష యము తెలుసుకోవాలని ఆసక్తి ఇతరులతో కలవాలనే ఆసక్తి పెరుగుతాయి . ఈ వయస్సులో వారు ఏ వస్తువుతోనయనా ఆడుకోగలరు. సొంతముగా ఆలోచించే శక్తి పెరుగుతాయి.
ఏ క్రీడ లో అయినా సాదారణముగా వేగం (చురుకుదనము) ,బలము (శక్తి ) ,(ఫ్లెక్షిబులిటి ) వంగేగుణము ,కో-ఆర్డినేషన్ మరియు వోర్పు (Endurance ) అనే మోటార్ క్వాలిటీస్ అవసరం .
బంతి ఆటలలో మరియు జిమ్నాస్టిక్స్ లో మోటార్ క్వాలిటీస్ ఎదుగుదల తొందరగా ఉంటుంది .
7-10 సంవత్సరముల వయస్సును Midde-Childhood స్టేజి అంటారు . ఈ దశలో పిల్లల యొక్క శారీరక మానసిక ఎదుగుదల వేగంగా ఉంటుంది. తర్కముగా logically ఆలొచించగలుగుతారు , పోటీ తత్వము పెరుగుతుంది . ఈ వయస్సులో వారిని ఏ క్రీడలలోనయనా చేర్చవచ్చు .
10-13 సంవత్సరముల వయస్సును Late -Childhood స్టేజి అంటారు . ఈ దశలో పిల్లల యొక్క శారీరక మానసిక ఎదుగుదల వేగంగా ఉంటుంది.ముక్యముగా ఆడపిల్లల్లో మేచ్యురిటి దశ కావునా కొంచము జాగ్రత్త అవసరము . మగపిల్లలలో (strength )శక్తీ ఎదుగుదల వేగంగా ఉంటుంది కావునా మంచి ప్రదర్సన చేయగలుగుతారు . ఇది క్రీడలలో జాయిన్ చేయడానికి లేట్ వయస్సుగా చెప్పవచ్చు ఎందుకంటే స్కిల్స్ తొందరగా నేర్చుకొనే సామర్జ్యం తక్కువగా ఉండే అవకాసము ఉంది .
ఏ క్రీడలోనయనా కనీసం 10 సంవత్సరములు కష్టపడే వారికి మాత్రమే తగిన అవకాశాలు వస్తాయి .
Go to Part-1