About

360 Degree Solutions For Sports Needs

కప్పల తక్కెడ Sakshi | Updated: November 26, 2014 23:40 (IST)

కొందరికి, కొన్నింటికి - వాటి ద్వారా కలిగే ప్రభావాన్ని బట్టి కొన్ని అపప్రథలు మిగులుతాయి. సంస్కృతం ‘మతవాది’ అన్నది కూడా అలాంటిదే.
బొత్తిగా బూజుపట్టిన ఆలోచనలున్న ఒక పాఠ కుడు - ఒకానొక ఆంగ్ల దినపత్రికలో మొన్న ఒక సంపాదక లేఖ రాశాడు. ఈ దేశంలో సంస్కృత భాషని పెంపొందించుకో వాలని అంటూ, ఆ భాష మతానికే కాక వైద్యం, రసాయనిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, జ్యోతిషశాస్త్రం, గణితశాస్త్రం, ధనుశ్శాస్త్రం, అణుశాస్త్రం వంటి విభా గాలలో ఎంతో పురోగతిని సాధించిందని గర్వ పడ్డాడు. ఇలాంటి మైనారిటీ ఆలోచనలున్న వ్యక్తు లింకా ఈ దేశంలో ఉండటం ఆశ్చర్యకరం.
 చాలా కాలం కిందట ఓ విదేశీ దౌత్య ఉద్యోగి మన భారతీయ ఉద్యోగిని అడిగారట:
 ‘ఏమండీ! మీ దేశంలో ప్రపంచానికి దీటుగా నిలువగల, అత్యంత పురాతనమయిన సంస్కృత భాష ఉందికదా, దాని వికాసానికి మీ ప్రభుత్వం పూనుకోదేం?’’ అని.
 భారత దౌత్య ఉద్యోగి ఆ ప్రశ్నకే కంగారు పడి పోయి ‘‘బాబూ, మా దేశంలో సంస్కృతానికీ మతా నికీ లంకె. అందుకని ఆ భాషని మేం ముట్టుకోము’’ అన్నారట. మన దేశంలో చాలా దున్నలు ఈనుతూ ఉంటాయి. వాటి దూడల్ని మనం అనునిత్యం పశు వుల కొట్టాల్లో కట్టేస్తూంటాం.
 
మన గొప్పతనం పొరుగువాడు చెప్తే మనకు రుచిస్తుంది. అమెరికా అంతరిక్ష పరిశోధక సంస్థలో సైంటిస్టు రిక్ బ్రిగ్ మాటలివి. ‘సంస్కృతం గణితం, శాస్త్ర పరిశోధనకేకాక ఉచ్చారణను అభివృద్ధి చేయ డానికి ఉపయోగపడుతుంది. ఏకాగ్రతను పెంచు తుంది. ఆ భాషలోని అక్షరాలు సశాస్త్రీయమైనవి. వాటిని సరిగ్గా ఉచ్చరిస్తే మాటలో స్వచ్ఛత, ధాటీ పెరుగుతుంది. ఆలోచనాశక్తి పదునుదేరి, జ్ఞాపకశక్తి, ధారణ పెరుగుతుంది.’ విచిత్రంగా ప్రపంచ భాషల న్నింటిలో నేటి కంప్యూటర్‌కి చక్కగా అతికినట్టు సరిపోయే భాష సంస్కృతం (ట). Sanskrit and computer are perfect fit.
 
ఐర్లాండులో ఒక స్కూలులో సంస్కృతం నేర్పు తారు. ఇలాంటి స్కూళ్లు ప్రపంచంలో ఆరే ఉన్నాయి. ఓ జర్మన్ తండ్రి రడ్గర్ కోర్టెన్‌హోస్ట్ తన కొడుక్కి ఎం దుకు సంస్కృతం నేర్పిస్తున్నాడో ఒక వ్యాసం రాశా డు. ఆయన మాటలు:  శబ్ద సౌందర్యం, ఉచ్చారణ లో తూకం, భాషా శిల్పంలో నిర్దుష్టత ఏ భాషలోనూ ఇంతగా లేదు. మిగతా భాషల్లాగ సైద్ధాంతికంగా ఈ భాషలో ఎట్టి మార్పూ రాదు. మానవాళి ఆర్జించు కున్న అతి పరిణతిగల భాషగా సంస్కృతానికి ఎలాంటి మార్పూ అవసరం లేదు. అందుకే సంస్కృ తం లిపిని ‘అక్షరం’, అంటే నశించనిది, అన్నారు. ఇదీ ఆయన వివరణ.
 
కొందరికి, కొన్నింటికి - వాటి ద్వారా కలిగే ప్రభావాన్ని బట్టి కొన్ని అపప్రథలు మిగులుతాయి. సంస్కృతం ‘మతవాది’ అన్నది కూడా అలాంటిదే. ఈ రోజుల్లో ప్రతి రచనా కాలధర్మాన్ని బట్టి ఎలా పీడిత ప్రజాభ్యుదయం లక్ష్యంగా పురోగమిస్తోందో, ఆ రోజుల్లో సంస్కృతమూ ధర్మమూ, దైవమూ ప్రాతిపదికగా రచనల్ని సాగించింది.
 
ఊహించని స్థాయిలో మేధా సంపత్తిని, భక్తి తత్పరతని ప్రదర్శించినప్పుడు తన్మయులమవు తాం. ఆ ప్రతిభ అవధులు దాటితే చెప్పడానికి మాటలు చాలవు. అప్పుడేమంటాం? మాటలకం దని ‘దేవుడు’ అంటాం. ఇంకా పై దశ - సాక్షాత్తూ దేవుని అవతారమే అంటాం. వర్తమానంలో అలాం టి ఉదాహరణ ఒకటుంది. సచిన్ తెందూల్కర్‌ని మనం ‘దేవుడు’ అనే అంటున్నాం. ఈ యీ అపూర్వమైన మౌలిక రచనల మీద మతం ‘మరక’కి అర్థం అదే.
 
కాగా, మనది ప్రజాస్వామిక వ్యవస్థ. పాపం, మన ప్రభుత్వం ఆగస్టు 7-15 వరకు సంస్కృత వారోత్సవాలు జరపాలని సెకెండరీ విద్యా కేంద్ర సంస్థ ఒక ఆదేశాన్ని జారీ చేసింది. తమిళనాడులో వైకోగారి ఎం.డి.ఎం.కె.; రామదాసుగారి పి.ఎం.కె. పార్టీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. వెంటనే ఈ ఆదేశాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
 
డి.ఎం.కె. ఇలంగోవన్ ఒకమాట అన్నారు: ‘మా తమిళం సంస్కృతం కంటే ఏ మాత్రం తీసి పోదు’ - అని. వర్తమాన పరిభాషలో ‘వెంకయ్య మహానుభావుడు’ అంటే ‘వీరయ్య శుంఠ’ అని అర్థం.
 హిందీ భాష పట్ల ఇలాంటి ఉద్యమాన్నే ద్రవిడ మున్నేత్ర కజగం జరిపి-హిందీని వ్యతిరేకించిన కారణంగానే ప్రజామోదాన్ని సంపాదించి 45 సంవత్సరాలుగా ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తోంది.
 
భారతదేశం ప్రపంచంలో మొట్టమొదటి సారిగా ‘సున్నా’ను కనిపెట్టింది. గణితశాస్త్రంలో అదొక పెద్ద మలుపు. ఆర్యభట్టు, వరాహమిహు రుడు, చరకుడు, శుశ్రుతుడు, పాణిని, లీలావతి వంటివారెందరో సంస్కృతంలో ఎన్నో విభాగాల వికాసానికి బాటలు వేశారు.
 
అయినా ఈనాటి భాషా వికాసం ఆయా విష యాల మీద బొత్తిగా అవగాహన లేని రాజకీయ పార్టీలు, నాయకుల పరిధిలో ఇరుక్కోవడం - ఈనాటి అభివృద్ధికి నిదర్శనం. మరొక్కసారి - సంస్కృతంలో మతం వాటా కేవలం పది శాతం.

Leave a Reply