About

360 Degree Solutions For Sports Needs

VK Weightlifting Academy-Vijayawada

VK ACADEMY OF SPORTS & EDUCATION seeks to perpetuate the spirit and beliefs of the sporting legend and champions through its support of young athletes. Helping individuals with the ambition, dedication and courage to achieve success against significant personal odds is our mission. VK aims at eliminating any disadvantages or handicaps by providing all essential– physiological, physical, psychological and technological training inputs A non-profit making organization, VK.SPORTS ACADEMY aims to promote the development of young Athletes to their fullest potential.

for details click the below link

Read more

SGF,Krishan Calendar 2019-20




Read more

T Sukanya Got 1st place in Senior Telangana state Weightlifting Championship


Read more

జాగ్యా తాండ నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన గిరిజన జాతిరత్నం తేజావత్ సుకన్యా భాయ్

జాగ్యా తాండ నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన గిరిజన జాతిరత్నం  తేజావత్ సుకన్యా  భాయ్ 




తేజావత్ సుకన్య భాయ్   మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ కురివి మండలం జాగ్యా తాండలో 15-12-1995 లో లక్ష్మణ్ మరియు బద్రి ల మూడవ సంతానంగా జన్మించినది . ముగ్గురు ఆడపిల్లలు అయినా తన పిల్లలు ఏదో ఒకటి సాధించాలని లక్ష్మణ్ కల పెద్ద అమ్మాయి సుజాతని M.B.B.S ,  రెండొవ అమ్మాయి సునీతని   ఇంజనీరింగ్ చదివించారు   ఆఖరి అమ్మాయిని తనకు ఇష్టం అయిన క్రీడలలో ప్రోత్సహహించారు .
లక్ష్మణ్ మణుగూరు సింగరేణి కాలరీస్ లో పనిచేస్తున్నారు . నెల జీతం ఫై ఆధారపడి బ్రతికే  ఉద్యోగి పిల్లల చదువులు కోసం తన సంపాదన అంతా ఖర్చు పెట్టేవారు . పెద్దవాళ్ళు ఇద్దరికి పెళ్లి చేసారు. చిన్న అమ్మాయి సుకన్య స్కూల్ గేమ్స్ లో వాలీబాల్ ఆడేది , స్టేట్ లెవెల్లో మెడల్ సాధించడంతో లక్ష్మణ్ ఆనందం
మణుగూరు హోలీ ఫామిలీ స్కూల్లో 10th  పాస్ అయిన తరువాత మాసాబ్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో 2011 లో  సివిల్ డిప్లొమో లో జాయిన్ అయ్యి ఎల్ బి స్టేడియం లో వాలీబాల్ ప్రాక్టీస్ చేయడానికి డైలీ వెళ్లేదానిని. అక్కడ వాలీబాల్ ఆడేటప్పుడు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కోరకు వెయిట్లిఫ్టింగ్ కోచ్ వి. ఎన్ . రాజశేఖర్ దగ్గరకు వెళ్లేదాన్ని .

వెయిట్లిఫ్టింగ్ కోచ్ వి. ఎన్ . రాజశేఖర్ నా బాడీ వెయిట్ లిఫ్టింగ్ కి సరిపోతుంది చెయ్యమని ప్రోత్సహించారు . మా నాన్నగారు సరే అనడంతో 2014 లో వాలీబాల్ వదిలి వెయిట్ లిఫ్టింగ్ లో జాయిన్ అయ్యాను . డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ లో మెడల్ రావడంతో ఉత్సాహం  పెరిగింది . 2016 మే వరకు ప్రాక్టీసు బాగానే జరిగింది
కానీ కోచ్ తెలంగాణ నుండి ఆంధ్రాకు ట్రాన్సఫర్ అవడంతో ప్రాక్టీస్ సరిగా జరగడం లేదు . కోచ్ ని కలిస్తే విజయవాడ
VK అకాడమీ కి రావలిసిందిగా చెప్పారు . నాన్నగారు సరే అనడంతో విజయవాడ VK అకాడమీ లో కోచ్ వి. ఎన్ . రాజశేఖర్ దగ్గర జాయిన్ అయ్యాను .
14th ఇంటర్నేషనల్ ఉమెన్ వెయిట్ లిఫ్టింగ్ గ్రాండ్ ప్రిక్స్ కి  అకాడమీ కి ఎంట్రీ రావడం తో కోచ్ రాజశేఖర్  గారు నన్ను కూడా ఈ కాంపిటీషన్ కి రెడీ అవ్వమన్నారు . కొంచం భయం కానీ కోచ్ ప్రోత్సహంతో స్పెషల్ ప్రాక్టీసు ప్రారంభించాను . ఇష్టం లేకపోయినా డైట్ తీసుకున్నాను ,ఎన్నో రాత్రులు నెప్పులుతో నిద్రపోలేదు. కోచ్ ఇచ్చిన టార్గెట్ చేరుకోవడంతో  నా  ఎంట్రీ కూడా పంపించారు . ఆర్గనైజర్స్ నా  ఎంట్రీ టోటల్ కి సంతృప్తి చెంది ఇన్విటేషన్ పంపించారు .
ఈ లోపు మా తాతగారయిన తేజావత్ రామచంద్రు నాయక్ గారి సూచనతో స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీ పద్మారావు గారిని కలిసాను . వారి సూచనతో SATS, MD శ్రీ దినకర బాబు గారిని కలిసి కాంపిటీషన్ కి ప్రిపేర్ కావడానికి సహాయం చేయవలసిందిగా కోరుకున్నాను . వారు కాంపిటీషన్ బాగుచేసి వస్తే నెక్స్ట్ కాంపిటీషన్ కి సహాయం చేస్తానన్నారు .
మేము మొత్తం 3 ప్లేయర్స్ 2 కొచ్చేస్  5th న హైదరాబాద్ నుండి నాగోల్డ్, జర్మనీ కి బయలుదేరాము 6th న నాగోల్డ్ చేరినాము . స్పాన్సర్ దొరకకపోవడంతో మా నాన్నే మొత్తం ఖర్చు 2 లక్షలు వరకు పెట్టినారు .
వాతావరణం చాల చల్లగా ఉంది వారికీ అది వేసవికాలం తెల్లవారుజామున 13డిగ్రీల వరకు ఉండేది . ప్రాక్టీస్ చాలా కష్టంగా ఉంది మొదటి అంతర్జాతీయ పోటీలు కావడంతో భయంగా ఉంది . అనేకమంది యూరోపియన్ ఛాంపియన్ లు వచ్చారు , మొత్తం 18 దేశాలు వచ్చాయి . జూన్  10న నా కాంపిటీషన్  కోచ్ రాజశేఖర్ చాల ఎంకరేజీ చేసారు . కాంపిటీషన్ కి వచ్చిన సీనియర్ ప్లేయర్స్ చాల కలిసిపోయారు . ఇప్పటికి ఫేస్బుక్ లో కలుస్తున్నారు . చివరికి విజయవంతంగా మొదటి అంతర్జాతీయ పోటీలులో 6th ప్లేస్ సాధించాను . మెడల్ రావడానికి చాల కష్టపడాలని అర్ధం అయ్యింది .
15 ఇంటర్నేషనల్ విమెన్ వెయిట్ లిఫ్టింగ్ గ్రాండ్ ప్రిక్స్ కి తయారు అవుతున్నాను . అన్న మాట ప్రకారం SATS, MD శ్రీ దినకర బాబు గారు ఆర్థిక సహాయం చేసారు వారికీ ధన్యవాదాలు . నన్ను ఎప్పుడు ప్రోత్సహించే తల్లితండ్రులు  మా తాతగారు తేజావత్ రామచంద్రు నాయక్ గారు ,బానోత్ భద్రునాయక్ గారు  మా కోచ్ రాజశేఖర్ ఆశీస్సులతో మే 10 నుండి 13వరకు స్పెయిన్ లోని తేనెరీఫ్ లో జరిగిన 15 ఇంటర్నేషనల్ విమెన్ వెయిట్ లిఫ్టింగ్ గ్రాండ్ ప్రిక్స్ లో 90kg  విభాగంలో స్స్నాచ్ లో 75కేజీలు +క్లీన్ & జెర్క్ లో 85కేజీలు =మొత్తం 160 కేజీలు ఎత్తి 2nd place (సిల్వర్ medal ) సాధించాను . .

జులై  6 నుండి 7 వరకు 2019 లో  తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్ లో జరిగిన 5th తెలంగాణ సీనియర్ స్టేట్ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో 76 కేజీల విభాగంలో ప్రథమస్థానం సాధించి ఓవరాల్  బెస్ట్ విమెన్ వెయిట్ లిఫ్టర్ టైటిల్ సాధించాను .

ఇప్పటివరకు నన్ను  ప్రోత్సహించిన వారందరికీ  నా ధన్యవాదాలు తెలియ చేస్తూ  నన్నుఎప్పుడు తెలంగాణకు మరియు మన దేశానికీ  పతకాలు సాధించేలా ఇలాగే ప్రోత్సహించాలని ఆశిస్తున్నాను
 నాకు ఎవరయినా స్పాన్సర్స్ ముందుకు వచ్చి ప్రోత్సహిస్తే తప్పక అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం పేరు మరియు  స్పాన్సర్స్ పేరు  నిలబెడతానని తెలియ చేస్తున్నాను .

Read more

Join VK Academy for better feature




Read more

VK Academy of Sports & Education


*V K Academy of Sports & Education 

సైనిక ఉద్యోగాలు,పోలీసు ఉద్యోగాల లో చేరాలనుకొనే యువకులకు శుభవార్త..
రాష్ట్రంలో అత్యుత్తమ అధ్యాపకులు మరియు అంతర్జాతీయ  స్థాయి కోచ్ లతో ఉద్యోగాలకు శిక్షణా తరగతులు నిర్వహించబడుతున్నాయి
We offered Courses in Intermediate

MPC,

MEC,

CEC,

HEC


along with Intermediate we gave competitive exams coaching also ( Defence,Police and all)


VK Weightlifting Academy,

VK Athletics Academy 



Office Address:

VK Academy,
 NH 65 ,
Beside ZPH School 
Mulapadu,
Vijayawada Rural,
Andhra Pradesh,
India
Zip-521456

For details -
Cantact:6345624707,8247495966 
Email: vkacademy99@gmail.com


Residential and Day-scholar


Note: ఈ కోచింగ్ ద్వారా పైన తెలిపిన ఉద్యోగాలే కాకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో చాలా ప్రభుత్వ ఉద్యోగాలను సాధించే ఫౌండేషన్ ఏర్పడుతుంది.
please share this information in your  whatsapp, Facebook  groups 

Read more

VK Academy of Sports & Education


Read more