Telangana Sports-Up-coming Women Weightlifter T Sukanya
0
comments
Raj
-
తేజావత్ సుకన్య నాయక్
మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ జాగ్యా
తాండలో లో
లక్ష్మణ్ మరియు బద్రి ల మూడవ సంతానంగా జన్మించినది . ముగ్గురు ఆడపిల్లలు కావడంతో
ఆఖరి అమ్మాయిని తనకు ఇష్టం అయిన క్రీడలలో ప్రోత్సహహించారు .
మణుగూరు హోలీ ఫామిలీ
స్కూల్లో 10th పాస్
అయిన తరువాత మాసాబ్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో 2011 లో సివిల్
డిప్లొమో లో జాయిన్ అయ్యి ఎల్ బి స్టేడియం లో వాలీబాల్ ప్రాక్టీస్ చేయడానికి డైలీ
వెళ్లేదానిని. అక్కడ వాలీబాల్ ఆడేటప్పుడు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కోరకు
వెయిట్లిఫ్టింగ్ కోచ్ వి. ఎన్ . రాజశేఖర్ దగ్గరకు వెళ్లేదాన్ని .
వెయిట్లిఫ్టింగ్ కోచ్ వి.
ఎన్ . రాజశేఖర్ నన్ను వెయిట్ లిఫ్టింగ్ చెయ్యమని ప్రోత్సహించారు .
మా నాన్నగారు సరే అనడంతో 2014 లో
వాలీబాల్ వదిలి వెయిట్ లిఫ్టింగ్ లో జాయిన్ అయ్యాను . డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ లో
మెడల్ రావడంతో ఉత్సహం పెరిగింది . 2016 మే వరకు ప్రాక్టీసు బాగానే జరిగింది
కానీ కోచ్ తెలంగాణ నుండి
ఆంధ్రాకు ట్రాన్సఫర్ అవడంతో ప్రాక్టీస్ సరిగా జరగడం లేదు . కోచ్ ని కలిస్తే
విజయవాడ
సి. బి. ఆర్ అకాడమీ కి
రావలిసిందిగా చెప్పారు . నాన్నగారు సరే అనడంతో విజయవాడ సి. బి. ఆర్ అకాడమీ లో కోచ్
వి. ఎన్ . రాజశేఖర్ దగ్గర జాయిన్ అయ్యాను .
14th ఇంటర్నేషనల్ విమెన్ వెయిట్ లిఫ్టింగ్ గ్రాండ్
ప్రిక్స్ కి సి. బి. ఆర్ అకాడమీ కి ఎంట్రీ రావడం తో కోచ్ మరియు సి. బి. ఆర్
ప్రసాదు గారు నన్ను కూడా ఈ కాంపిటీషన్ కి రెడీ అవ్వమన్నారు . కొంచం భయం కానీ కోచ్
ప్రోత్సహంతో స్పెషల్ ప్రాక్టీసు ప్రారంభించాను . ఇష్టం లేకపోయినా డైట్
తీసుకున్నాను ,ఎన్నో
రాత్రులు నెప్పులుతో నిద్రపోలేదు. కోచ్ ఇచ్చిన టార్గెట్ చేరుకోవడంతో మరియు సి. బి.
ఆర్ ప్రసాదు గారు స్పాన్సర్ చేస్తానని చెప్పడంతో నా ఎంట్రీ కూడా పంపించారు .
ఆర్గనైజర్స్ నా ఎంట్రీ
టోటల్ కి సంతృప్తి చెంది ఇన్విటేషన్ పంపించారు .
కాంపిటీషన్ ఖర్చులు మొత్తం
అకాడమీ నుండి సి. బి. ఆర్ ప్రసాదుగారు స్పాన్సర్ చేసారు .
ఈ లోపు మా తాతగారయిన
తేజావత్ రామచంద్రు నాయక్ గారి సూచనతో స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీ పద్మారావు గారిని కలిసాను
. వారి సూచనతో SATS, MD శ్రీ
దినకర బాబు గారిని కలిసి కాంపిటీషన్ కి ప్రిపేర్ కావడానికి సహాయం చేయవలసిందిగా
కోరుకున్నాను . వారు కాంపిటీషన్ బాగుచేసి వస్తే నెక్స్ట్ కాంపిటీషన్ కి సహాయం
చేస్తానన్నారు .
మేము మొత్తం 3 ప్లేయర్స్ 2 కొచ్చేస్ మరియు సి. బి. ఆర్
ప్రసాదు గారు 5th న
హైదరాబాద్ నుండి నాగోల్డ్, జర్మనీ
కి బయలుదేరాము
6th న
నాగోల్డ్ చేరినాము .
వాతావరణం చాల చల్లగా ఉంది
వారికీ అది వేసవికాలం తెల్లవారుజామున 13డిగ్రీల వరకు ఉండేది . ప్రాక్టీస్ చాలా కష్టంగా ఉంది మొదటి
అంతర్జాతీయ పోటీలు కావడంతో భయంగా ఉంది . అనేకమంది యూరోపియన్ ఛాంపియన్ లు వచ్చారు , మొత్తం 18 దేశాలు వచ్చాయి . జూన్ 10న నా
కాంపిటీషన్ నాతో పాటు వచ్చిన రాజ్యలక్ష్మి మరియు రాజేశ్వరి అక్కలు ఇద్దరు చాల
ఎక్సపీరియన్స్ ఉన్నవారు కావడం తో నాకు చాలా ఉపయోగపడింది . కోచ్ రాజశేఖర్ చాల
ఎంకరేజీ చేసారు . కాంపిటీషన్ కి వచ్చిన సీనియర్ ప్లేయర్స్ చాల కలిసిపోయారు .
ఇప్పటికి ఫేస్బుక్ లో కలుస్తున్నారు . చివరికి విజయవంతంగా మొదటి అంతర్జాతీయ
పోటీలులో 6th ప్లేస్
సాధించాను . మెడల్ రావడానికి చాల కష్టపడాలని అర్ధం అయ్యింది . వచ్చే
సంవత్సరం వరల్డ్
యూనివర్సిటీ మరియు 15 ఇంటర్నేషనల్
విమెన్ వెయిట్ లిఫ్టింగ్ గ్రాండ్ ప్రిక్స్ కి తయారు అవుతున్నాను . ఖమ్మం లో నవంబర్ 4,5-2017 న జరిగిన సౌత్ ఇండియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో 69కేజీ విభాగంలో 75కేజీ స్నాచ్ 80కేజీ క్లీన్ & జెర్క్ చేసి బంగారు పథకం సాధించాను.
అన్న మాట
ప్రకారం SATS, MD శ్రీ
దినకర బాబు గారు ఆర్థిక సహాయం చేసారు వారికీ ధన్యవాదాలు . నన్ను
ఎప్పుడు ప్రోత్సహించే తల్లితండ్రులు మా తాతగారు తేజావత్ రామచంద్రు నాయక్ గారు మా కోచ్
రాజశేఖర్ ఆశీస్సులతో తప్పక అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తానని ఆశిస్తున్నాను . నాకు
ఎవరయినా స్పాన్సర్స్ ముందుకు వచ్చి ప్రోత్సహిస్తే తప్పక అంతర్జాతీయ స్థాయిలో
భారతదేశం పేరు మరియు స్పాన్సర్స్ పేరు నిలబెడతానని తెలియ
చేస్తున్నాను .
Academy of Adventure sports News
అకాడెమి ఆఫ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ వారి ఆద్వర్యంలో అక్టోబర్ 30 నుండి నవంబర్ 3-2017 వరకు సి బి ఆర్ స్పోర్ట్స్ స్కూల్ నందు జరిగిన 5 రోజుల బేసిక్ అడ్వెంచర్ కోర్స్ కి 13 జిల్లాలలోని ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల కాలేజెస్ నుండి బాలురు 56 మరియు బాలికలు 16 మంది పాల్గొన్నారు మొత్తం 72 మంది పాల్గొన్నారు. .
వీరికి పర్వత అధిరోహణం, త్రాళ్ళతో అధిరోహించడం, bouldering ,physical fitness ,trekking లో శిక్షణ ఇవ్వడం జరిగింది .
వీరికి పర్వత అధిరోహణం శిక్షకులు పరమేష్ సింగ్ , కృష్ణఇందు ,శిక్షణ ఇచ్చారు .
ఈ రోజు జరిగిన బేసిక్ అడ్వెంచర్ కోర్స్ ముగింపు సభలో సి బి ఆర్ స్పోర్ట్స్ స్కూల్ ఫౌండర్ sri CBR Prasad garu ,అకాడెమి ఆఫ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ secretary U.రఘునాధ రెడ్డి అభినందించారు .
అకాడెమి ఆఫ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ secretary U.రఘునాధ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరైనా ఆసక్తి గల యువతకు తమ అకాడెమి ఆఫ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ద్వారా శిక్షణ ఇస్తామన్నారు .
అకాడెమి ఆఫ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ తో కలసి కలసి రాష్ట్రమంతా అనేక అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆక్టివిటీస్ మొదలుపెడుతుందని తెలియచేసారు. గౌరవనీయులయిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు యువతకు అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆక్టివిటీస్లో అవకాశం కల్పించడానికి అనేక వసతులు కల్పించారని
తెలియచేసారు . ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల సెక్రటరీ శ్రీ దేవర వాసు గారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారిని ఆదర్శంగా తీసుకోని గిరిజన పాఠశాలల విద్యార్థిని విద్యార్థులను బేసిక్ అడ్వెంచర్ కోర్స్కి పంపించినందుకు కృతజ్ఞతలు తెలియచేసారు .
U.రఘునాధ రెడ్డి కాంటాక్ట్ number 9493362436
Raja sekhar 8885579707
Followers
Popular Posts
-
61 st National School Games Weightlifting Championship CBR Academy,Kethanakonda,AndhraPradesh from 16th to 19th ...
-
Hyderabad District Level Weightlifting Championship is organised by L. B. S. Liters Corner at L.B.Stadium Weightlifting hall on 15 August...
-
Osmaniya university ,Hyderabad weightlifting team take part in the all India university weightlifting competitions at udaipur Rajastan on 20...
-
South Zone Power lifting Sub-Junior, Junior, Senior Championship for Men & Women conducted on 3rd to 5th jan-2013 at Lal Bhadur Indo...
-
61 st National School Games Weightlifting Championship CBR Academy,Kethanakonda,AndhraPradesh from 16th ...
-
V N Raja sekhar, Weightlifting Coach,Contact no: 08885579707, Email :raj1269@gmail.com 61 st National School Gam...
-
61 st National School Games Weightlifting Championship CBR Academy,Kethanakonda,AndhraPradesh from 16th ...
-
ALL INDIA CIVIL SERVICES WEIGHTLIFTING STATE TEAM 2012-2013 SL NO NAME CATEGORY SNATCH CLEAN & ...
-
WEIGHTLIFTING COACHES IN ANDHRA PRADESH DURING PYKKA STATE MEET AT CBR ACADEMY,KETHANAKONDA,VIJAYAWADA CBR PRASAD,Dr.N.C.Mohan,Krishna...
Category List
Total Pageviews
All Rights reserved, www.luckysports.in. Powered by Blogger.